
‘పెళ్ళి చూపులు’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని తనవైపు తిప్పుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్. తొలి సినిమాతోనే జాతీయ అవార్డును కొల్లగొట్టారు. సరేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఈ సినిమాను నిర్మించారు. తొలి సినిమానే సూపర్ హిట్‌గా మలిచిన తరుణ్ భాస్కర్‌కు సురేష్ మరో అవకాశం ఇచ్చారు. ఆ చిత్రమే ‘ఈ నగరానికి ఏమైంది?’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా జూన్ 29 ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని తాజాగా చిత్ర యూనిట్, కొందరు సామాన్య ప్రేక్షకులకు ప్రదర్శించారు. సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో చిత్ర యూనిట్ మంగళవారం మీడియా సమావేశం నిర్వహించింది. ఇంకా చదవండి
Comments
Post a Comment