
కథల ఎంపికలో వైవిధ్యం ప్రదర్శిస్తూ.. హీరోగా తనెంటో ఫ్రూవ్ చేసుకున్న సుధీర్ బాబు నిర్మాతగా మారుతున్నారు. సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్‌లో తనే హీరోగా ‘నన్ను దోచుకుందువటే’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో సుధీర్ బాబు సరసన కన్నడ నటి నభా నటేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ‘సమ్మోహనం’తో సూపర్ హిట్ కొట్టిన సుధీర్ బాబు మరోసారి వైవిధ్యమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ‘నన్ను దోచుకుందువటే’ మోషన్ టీజర్ చూసిన వారికి కచ్చితంగా ఈ ఫీలింగ్ కలుగుతుంది. ఎన్టీఆర్ నటించిన గులే భకావళి చిత్రంలోని ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్‌నే ఈ సినిమా టైటిల్‌గా పెట్టడం విశేషం.Read more
Comments
Post a Comment