
విశాల్, సమంత హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘అభిమన్యుడు’. విభిన్న కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. కోలీవుడ్‌లో విడుదలై సూపర్ హిట్ కొట్టిన ‘ఇరుంబు తిరై’ని తెలుగులో 'అభిమాన్యుడు' పేరుతో విడుదల చేశారు. టెక్నాలజీ మూలంగా మనిషి ప్రైవసీకి ఎలా భంగం కలుగుతోంది, సైబర్ నేరగాళ్లు టెక్నాలజీని వాడుకొని ఎలా మోసాలకు పాల్పడుతున్నారు అనే అంశాలను ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు. దీంతో ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా చేరువైంది.ఇంకా చదవండి
Comments
Post a Comment