
తన తనయుడు అకీరా ఫొటోను ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్టు చేసిన నటి, పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్.. ఇదే సమయంలో తన ఫాలోయర్లకు ఒక హెచ్చరిక కూడా చేసింది. అకీరాను ఎవరూ జూనియర్ పవర్ స్టార్ అని పిలవొద్దు అని రేణూ స్పష్టం చేసింది. ఎవరైనా అలా పిలిస్తే వారిని తను బ్లాక్ చేయిస్తా.. అని రేణూ దేశాయ్ హెచ్చరించింది. పవన్ కల్యాణ్ తనయుడు కూడా హీరో అవుతాడు. జూనియర్ పవర్ స్టార్ అని పిలుచుకుందామనుకున్న అభిమానులకు ఇది ఒకింత నిరాశ కలిగిస్తోంది. ఈ నిరాశనే తమ కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు వాళ్లు.ఇంకా చదవండి
Comments
Post a Comment