
హైదరాబాద్ వేదికగా జరిగే సౌత్ ఇండియా ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ కార్యక్రమం కొద్ది సేపటి క్రితం అతిరదమహారథుల సమక్షంలో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా సౌత్ ఇండియా మూవీస్‌లో వివిధ కేటగిరిలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఫిల్మ్ ఫేర్ అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఫిల్మ్ ఫేర్ అవార్డుల ఫంక్షన్‌కి హోస్ట్ చేస్తూ ప్రధాన ఆకర్షణగా నిలిచింది తెలుగు హీరోయిన్ ఇషా రెబ్బా. యువ హీరోలు సందీప్ కిషన్ , రాహుల్ రవీంద్రన్ మేల్ యాంకర్స్‌గా సందడి చేస్తుండగా.. ఇషా రెబ్బా ఫీమేల్ యాంకర్‌గా తన టాలెంట్‌ను చూపిస్తుంది.Read more
Comments
Post a Comment